మెక్సికోలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ప్యూబ్లా రాష్ట్రంలోని తెహ్విట్టింగ్లో ఆదివారం ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలతోపాటు ఒక చిన్నారి ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఒక మహిళ తీవ్రంగా గాయపడడంతో.. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిందని తెలిపారు. ఈ ఏడాదిలో ఇది మూడో కాల్పుల ఘటన అని పోలీసులు గుర్తు చేశారు.