స్వీడన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక అరుదైన, అత్యున్నత గౌరవం దక్కింది. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా స్వీడన్ ప్రభుత్వం మోదీని తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, కమాండర్ గ్రాండ్ క్రాస్’ (Royal Order of the Polar Star, Commander Grand Cross) పేరుతో పిలిచే ఈ ప్రతిష్టాత్మక అవార్డును మోదీకి ప్రదానం చేశారు