మాల్దీవుల్లో దీవుల్లోని ఒక సముద్ర గర్భంలోని గుహలోకి స్కూబా డైవింగ్ చేస్తూ వెళ్లిన ఐదుగురు అన్వేషకులు ప్రాణాలు కోల్పోయారు. ఇటలీకి చెందిన ఐదుగురు 50 మీటర్ల లోతు కలిగిన సముద్ర గర్భంలోని గుహలోకి అన్వేషణకు వెళ్లారు. నీళ్లలో అన్వేషణకు వెళ్లిన వారు ఎంతసేపటికీ పైకి రాలేదు. దీనిపై సమాచారం అందుకున్న రక్షక దళాలు ఐదుగురి కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. వీరిలో బెనెడెట్టి అనే ఒక స్కూబా డైవర్ మృతదేహం మాత్రమే దొరికింది. నీళ్లలో గుహ ముఖద్వారం వద్ద అతడి మృతదేహం లభ్యమైంది.