రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఇద్దరు మహిళల మృతదేహాలు కలకలం రేపాయి. ఫామ్‌హౌస్ దగ్గర నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇటీవల వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో ఓ మహిళ, యాలాల పరిధిలో మరో మహిళ అదృశ్యమైనట్లు పోలీసులు గుర్తించారు. వారిని దుండగులు ఇక్కడికి తీసుకొచ్చి చంపి పూడ్చిపెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై తాండూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.