వందల ఏళ్ల క్రితం డచ్ వారి పాలనలో తరలిపోయిన చారిత్రక ఆనైమంగళం రాగి శాసనాలను (లైడెన్ ప్లేట్స్) నెదర్లాండ్స్ శుక్రవారం లాంఛనంగా భారత్కు అప్పగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటనలో ఈ అరుదైన చోళుల నాటి శాసనాల అప్పగింత జరిగింది. శతాబ్దానికి పైగా డచ్ ఆధీనంలో లైడెన్ విశ్వవిద్యాలయంలో భద్రంగా ఉన్నాయి. క్రీస్తుశకం 985 నుంచి 1014 సంవత్సరాల మధ్య రాజరాజ చోళుడి పాలనా కాలానికి చెందిన ఈ శాసనాలు తమిళ వారసత్వంలో కీలక భాగం.