అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. పాకిస్థాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనా తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ రికార్డులను తిరగరాశారు. ఉమెన్స్ టీ20 ఇంటర్నేషనల్స్ లోనే అత్యంత వేగంగా అర్ధ శతకం బాదిన ఘనతను ఆమె సొంతం చేసుకున్నారు. కరాచీ వేదికగా జింబాబ్వే ఉమెన్స్ టీమ్‌తో 19వ ఓవర్లో ఫాతిమా వరుసగా 4, 4, 6, 6, 4 బాదడంతో ఆ ఒక్క ఓవర్లోనే 24 పరుగులు వచ్చాయి.