స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లాస్టిక్ రీసైక్లింగ్ మెషిన్‌ను ప్రారంభించారు. పారిశుధ్య కార్మికులతో మాట్లాడి, వారి సేవలకు సెల్యూట్ చేశారు. ప్రతి పాఠశాల విద్యార్థికీ సంవత్సరానికి రూ.15,000 చొప్పున తల్లి ఖాతాలో జమ చేస్తారు. 67 లక్షల మంది తల్లులకు లాభం చేకూరుతుందనీ, ఈ పథకానికి రూ.15వేలను ఇంకా పెంచాలని ఆలోచిస్తున్నామని చంద్రబాబు అన్నారు. గత అమ్మఒడి మార్గదర్శకాలు కొనసాగుతాయనీ, తల్లి లేని సందర్భాల్లో తండ్రి లేదా గార్డియన్ ఖాతాకు డబ్బు వెళ్తుందని స్పష్టం చేశారు.