గత 14 ఏళ్ల వైవాహిక జీవితంలో తాను ఒక బానిసలా బతికానని జయం రవి ఆవేదన చెందారు. తాను కష్టపడి సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులన్నీ భార్య వైపు వాళ్లే ఉంచుకున్నారని, ప్రస్తుతం తాను అద్దె ఇంట్లో ఉంటున్నానని తెలిపారు. ఇప్పుడు కనీసం తన పిల్లలను కూడా చూడనివ్వడం లేదని రవి మోహన్ తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కారు. చివరగా రవి మోహన్ మాట్లాడుతూ ‘మూడక్షరాల ఇడ్లీ నటి’ ఒకరు తన జీవితాన్ని నాశనం చేశారని, ఆమె ఎన్ని కుటుంబాలను కూల్చిందో తాను చెప్పాలా అని నిలదీశారు.