భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి అక్కడి ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. అనంతరం ప్రధాని మోదీ బస చేసిన హోటల్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న ప్రవాస భారతీయులు త్రివర్ణ పతాకాలతో, “భారత్ మాతా కీ జై”, “మోదీ మోదీ” అనే నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా ప్రధాని గౌరవార్థం భారతీయ శాస్త్రీయ సంగీతమైన ‘రాగ్ దేశ్’ (Raag Desh) ఆధారిత సాంప్రదాయ నృత్య ప్రదర్శనను స్థానిక కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు.