హైదరాబాద్‌లో, ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ వైర్లు తెగి కిందపడిపోవడంతో ఆరుగురు BRS పార్టీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మణికొండ సమీపంలోని డాలర్ హిల్స్‌లో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ కార్తీక్ రెడ్డి ని కలిసి తిరిగి కిందికి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కిన పార్టీ ముఖ్య నాయకులు లిఫ్ట్ కేబుల్ వైర్లు ఒక్కసారిగా తెగిపోవడంతో 5వ అంతస్తు ఎత్తు నుంచి లిఫ్ట్ నేరుగా కింద పడిపోయింది.