శంషాబాద్ ఎయిర్ పోర్టుకి వచ్చిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. మలేసియా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఏసియా విమానంలో బాంబు ఉన్నట్లుగా ఒక మెయిల్ రావడంతో.. ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తం అయ్యారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే.. దాన్ని ప్రత్యేక ఐసోలేషన్ ప్రదేశానికి తరలించి.. చెకింగ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏ బాంబూ దొరకలేదు. ఐతే.. స్కానర్ల ద్వారా అంతటా చెక్ చేస్తున్నారు. మరోవైపు ఆ మెయిల్ ఎవరు పంపారు? ఐపీ అడ్రెస్ ఏంటి అనేది కూడా పోలీసులు చెక్ చేస్తున్నారు.