చెన్నైలోని ఐటీ కారిడార్లో ఉన్న టెక్ మహీంద్రా గోదాము అగ్నిప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంటలను అదుపు చేయడానికి సుమారు వంద ఫైర్ ఇంజిన్లను ఉపయోగిస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో పక్కనే ఉన్న ఇతర ఐటీ ఆఫీసులను కూడా అధికారులు ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు.