యూఏఈ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు ఘనమైన అధికారిక స్వాగత కార్యక్రమం నిర్వహించారు. అబుదాబిలో జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల్లో ప్రధాని మోదీ, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య యూఏఈపై జరిగిన ఇటీవలి ఇరాన్ దాడులను ఖండించారు. ఈ క్లిష్ట సమయంలో యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులను అక్కడి ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా చూసుకుందని ఆయన అభినందించారు.