రక్షణ రంగంలో సంపూర్ణ స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పబ్లిక్, ప్రైవేటు రంగాలు చేయిచేయి కలిపి నడుస్తున్నాయని తెలిపారు. పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఆయుధాల తయారీ రంగంలో స్వావలంబన దిశగా కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. యుద్ధ రంగంలో డ్రోన్ టెక్నాలజీ ఒక గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. 8 డ్రోన్ కంపెనీలు కలిసి కర్నూలులో డ్రోన్ సిటీ ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఇక నుంచి కర్నూలును డ్రోన్ హబ్‌గా పిలుస్తారు’’ అని అన్నారు.