హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఫార్ములా-ఈ రేసు నిధుల దుర్వినియోగం కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు గట్టి షాక్ తగిలింది. ఈ వ్యవహారంలో ఏసీబీ దాఖలు చేసిన దాదాపు 250 పేజీల ఛార్జిషీట్‌ను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. కేటీఆర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మరో ఇద్దరికి సమన్లు జారీ చేసింది. వీరంతా జూలై 31న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.