కేబినెట్ కీలక నిర్ణయాలు: రాష్ట్రంలో వారానికి ఒక రోజు తప్పనిసరిగా ‘నో వెహికిల్ డే’ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులు, వీవీఐపీలు సైతం సొంత కార్లను పక్కనపెట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిక్ వాహనాలు లేదా సైకిళ్లను వినియోగించాలని ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశించారు. కొన్ని నెలల పాటు విదేశీ పర్యటనలను సైతం రద్దు చేసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. జిల్లా పర్యటనల్లో కూడా ప్రజాప్రతినిధులు కఠినంగా పొదుపు చర్యలు పాటించాలి.