మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 93 సార్లు పేపర్ లీక్ ఘటనలు జరిగాయని ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రివాల్ అన్నారు. “బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్‌లోనే ఎక్కువగా పేపర్ లీకులు అవుతున్నాయి. ఫలితంగా 6 కోట్ల మంది యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఏమాత్రం యాదృచ్ఛికం కాదు” అని స్పష్టం చేశారు.

