కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విచారణలో వేగం పెరిగింది. ఈ వ్యవహారంలో ఏర్పాటైన సిట్.. విచారణను వేగవంతం చేసింది. బండి భగీరథ్‌కు నోటీసులు జారీ చేశారు. బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో.. విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. బుధవారం రోజున పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు.

