జూన్‌లో సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తామని ఆరోగ్య శాఖ దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఆసుపత్రిలో విజయవంతంగా వైద్య సేవల ట్రయల్ రన్ జరుగుతోందని అన్నారు. సనత్‌నగర్ టిమ్స్‌లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్‌ను మంగళవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. పెండింగ్ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. సనత్‌నగర్ టిమ్స్ వెయ్యి పడకల ఆసుపత్రి అని, ఇందులో 300 ఎమర్జెన్సీ బెడ్లు ఉంటాయని తెలిపారు

