తమిళనాడు సీఎం విజయ్ తన టీంను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు సెక్రటరీలను నియమించుకోగా.. తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు, న్యూమరాలజిస్ట్గా పేరొందిన రిక్కీ రధన్ పండిట్ వెట్రివల్ ను సీఎంకు
పొలిటికల్ OSDగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయ్ కు సన్నిహితుడిగా, ఆధ్యాత్మిక సలహాదారుగా చెప్పుకునే ఈయన..’టీవీకే సునామీ లాంటి విజయం సాధించబోతుంది’ అని పలుమార్లు ప్రకటించారు. అన్నట్టుగానే టీవీకే భారీ విజయం సాధించడంతో ఈయన పేరు మారుమోగింది.

