ఖజానా మొత్తం ఖాళీ అయింది. దాదాపు పది లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రజలపై ఉన్నదని సీఎం విజయ్ అన్నారు. మోయలేని భారాన్ని భుజాలకు ఎత్తుకున్నానని తెలిపారు. అందుకే ఆర్థిక పరిస్థితిని ప్రజలకు అర్థం చేయించడానికి ఒక వైట్ పేపర్ (శ్వేతపత్రాన్ని) విడుదల చేయాలనుకుంటున్నాను. రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏంటో, ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయో, ప్రతి నెలా వాటికి ఎంత ఖర్చు చేయాలో, మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయడానికి ఎంత ఖర్చవుతుందో, వైట్ పేపర్ లో వెల్లడిస్తా..’ అని వెల్లడించారు.