తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో భారీగా తరలివచ్చిన టీవీకే కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే తన మొదటి సంతకం ఉచిత్ విద్యుత్ హామీ పై చేశారు. తర్వాత మహిళా భద్రతపై రెండో సంతకం చేశారు. అనంతరం డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఈగల్ వ్యవస్థ తరహా ఏర్పాటుపై మూడో సంతకం చేశారు తమిళనాడు సీఎం విజయ్.