కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పిడుగు నరేష్(25) అనే యువకుడు, హనుమకొండకు చెందిన యువతి 11 సంవత్సరాలుగా ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి పేరుతో ఆమెను ప్రియుడు పలుమార్లు లొబరుచుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమ్మని అడగడంతో వివాహానికి అతడు నిరాకరించాడు. వేరే యువతితో నరేష్ పెళ్లి జరుగుతున్న విషయం తెలుసుకున్న ప్రియురాలు హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షురాలు అంజలి కాదర్, పలువురు మహిళలు, పోలీసులతో కలిసి పెళ్లి మండపానికి వెళ్లి పెళ్లి ఆపించింది.