ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలిసి సమావేశం అయ్యారు. పార్టీ మద్దతు దారులతో వెళ్లిన విజయ్ వెంట కర్ణాటక సినీ నిర్మాత కేవీఎన్ వెంకట్, ఏపీ గ్రానైట్ అండ్ మైనింగ్ వ్యాపారస్తుడు విష్ణు రెడ్డి ఉన్నారు. ప్రోటోకాల్ కు విరుద్ధంగా ఆ ఇద్దరు లోక్ భవన్ కు ఎలా వెళ్లారనే అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటులో నిర్మాతకు ఏం పని అంటూ రాజకీయ ప్రత్యర్థులు మండిపడుతున్నారు.