ఒమన్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అన్నమయ్య జిల్లాలోని వాయల్పాడుకు చెందిన షానవాజ్.. క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. షానవాజ్ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే.. ఆమె క్షేమంగా స్వదేశానికి తిరిగి రావడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను MEAIndia అభ్యర్థించానని తెలిపారు. వారు వెంటనే స్పందించారన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతర సమన్వయం, మానవతా దృక్పథం వల్ల.. షానవాజ్ క్షేమంగా భారత్ చేరుకున్నారని పేర్కొన్నారు.