తమిళనాడు రాజకీయాల్లో గంటల వ్యవధిలోనే అనూహ్య మలుపు చోటుచేసుకుంది. విజయ్ పట్టాభిషేకం ఖాయమన్న సంబరాల మధ్యే , ఐయూఎంఎల్, వీసీకే పార్టీల నుంచి అధికారికంగా లేఖ అందలేదని తమిళనాడు లోక్‌భవన్ తెలిపింది. టీవీకేకు మద్దతుగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల నుంచి మాత్రమే గవర్నర్ కు లేఖలు అందాయి. ఐతే, మద్దతు ప్రకటిస్తారని అనుకున్న వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు మాత్రం గవర్నర్ కు లేఖ అందించలేదు. మరో సంచలన ట్విస్ట్ అన్నాడీఎంకే అధినేత పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని టీటీవీ దినకరన్ గవర్నర్‌కు లేఖ రాశారు.