రాజధాని అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కలెక్టర్ల సదస్సు జరుగుతున్న సమయంలో.. సచివాలయంపై డ్రోన్ కలకలం అంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంది. శాంతిభద్రతల దృష్ట్యా కీలకమైన సమయంలో ఇలాంటి పుకార్లు పుట్టించడం వెనుక కుట్ర కోణం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న AI2903 విమానాన్ని చూపించి.. అది డ్రోన్ అంటూ తప్పుడు ప్రచారం చేశారని పోలీసులు నిర్ధారించారు.

