పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో నకిలీ విత్తనాలు రైతుల పాలిట శాపంగా మారాయి. అజిత అనే పేరుతో విక్రయించిన విత్తనాలు అసలు మొలకెత్తకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సుమారు వంద ఎకరాల్లో సాగు చేసిన రైతులు ఇప్పుడు పెట్టుబడి కూడా రాక లబోదిబోమంటున్నారు. నకిలీ విత్తనాలను నమ్మి సాగు చేసిన రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. పంట చేతికి వచ్చే సమయంలో దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వ్యాపారి మోసం బయటపడింది.
- 0 Comments
- Palnadu District