హంతా వైరస్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ అలర్ట్ ప్రకటించింది. హంతా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని, దీని నియంత్రణకు అన్ని దేశాలు సమన్వయంతో పనిచేయాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. కోవిడ్‌తో పోలిస్తే దీని మరణాల రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

