నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. విజయ్ పై భారీ కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. విజయ్ ది అధికారం కోసం పాకులాడే మనస్తత్వం కాదని పోసాని తెలిపారు. కానీ ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దళపతి అయిన విజయ్ ను అభిమన్యుడిని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. విజయ్ తనకు 1996 నుంచీ తెలుసని, విజయ్ చుట్టూ ఎన్నో గొడవలు ఉన్నా సంయమనంతో ఉన్నాడన్నారు. అయినా ఆయనపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.