తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే విజయ్ ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతి ఇవ్వని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ తీరుపై మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఫైర్ అయ్యారు. “తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానించకపోవడం ఆశ్చర్యకరం. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా తమిళనాడు గవర్నర్ వెంటనే టీవీకే నాయకుడిని రాష్ట్ర క్యాబినెట్ ఏర్పాటుకు ఆహ్వానించి, ఆయనను ముఖ్యమంత్రిగా నియమించి, సభలో మెజారిటీ నిరూపించుకునేలా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను” అని అన్నారు.