బందరు చరిత్ర తిరగరాసేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఈరోజు బందరులో తాగునీటి పైపులైన్లు, డీడబ్ల్యూఎం రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. ప్రతి ప్రాంతానికి రోడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు మాజీ మంత్రి పేర్ని నాని పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విమర్శించడం తప్ప బందరు ప్రయోజనాలు ఆయనకు పట్టవని అన్నారు.