చెన్నైలోని అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు సి.వి. షణ్ముగం కార్యాలయం ఇప్పుడు రాజకీయ వ్యూహాలకు అడ్డాగా మారింది. పార్టీకి ఉన్న మొత్తం ఎమ్మెల్యేలలో మూడింట రెండొంతుల మంది, అంటే సుమారు 35 మంది ఎమ్మెల్యేలు షణ్ముగం కార్యాలయంలో భేటీ అయ్యారు. వీరంతా విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఎడప్పాడి పళనిస్వామి గనుక మద్దతుకు నిరాకరిస్తే, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి విజయ్ వైపు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది.