ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ప్రధాన సైనిక చర్యలను ముగించినట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు. “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ”గా పిలవబడే ఈ ఆపరేషన్, తన లక్ష్యాలను సాధించడంతో పూర్తయిందని ఆయన తెలిపారు. భారీ స్థాయి ఆపరేషన్లు ముగిసినప్పటికీ, పరిస్థితి ఇంకా సున్నితంగా ఉందని, ఇరాన్ చర్యలను బట్టి అది మారవచ్చని రూబియో స్పష్టం చేశారు. రూబియో ప్రకారం, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ప్రారంభించిన ఆపరేషన్ వ్యూహాత్మక సైనిక లక్ష్యాల కోసమేనని, అవి ఇప్పుడు నెరవేరాయని ఆయన అన్నారు.