అన్నాడీఎంకే పార్టీలో ముసలం బయలు దేరింది. ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు విజయ్ కు టచ్ లో వెళ్లారనే టాక్ నడుస్తోంది. అందులో కొంత మంది షణ్ముగం నేతృత్వంలోని ఎమ్మెల్యేలు టీవీకే మద్దతు ఇవ్వాలని కోరారు. ఎడప్పాడి పళనిస్వామి అలర్ట్ అయ్యారు. అంతేకాదు తమ పార్టీ టీవీకే ఎలాంటి షరతులు లేకుండా బేషరతు మద్దతు ప్రకటించారు. టీవీకే కు చెందిన ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచి మద్దతు ఇవ్వాలని ఎడప్పాడి నేతృత్వంలోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సూత్రప్రాయంగా ఓ అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తుంది.