హనుమకొండలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ.. అమలుకాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. వరంగల్ గడ్డ మీద నుంచే కాంగ్రెస్ పార్టీ రైతుల డిక్లరేషన్ ప్రకటించిందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు పెద్ద దొంగలు అని రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ సభ పెట్టి దొంగ హామీలిచ్చారని మండిపడ్డారు. బాండ్ పేపర్లు రాసి మరీ కాకమ్మ కబుర్లు చెప్పారని మండిపడ్డారు. ఆ దొంగ హామీలు నమ్మి రైతులు కాంగ్రెస్‌కు ఓటేశారని అన్నారు.