తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ మద్దతును అందించాలని తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్.. తమను లాంఛనంగా కోరారని కాంగ్రెస్ తెలిపింది. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ శాసనసభ పక్షం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు తమ పూర్తి మద్దతును అందించాలని నిర్ణయించాయని తెలిపింది. భారత రాజ్యాంగాన్ని విశ్వసించని ఏ మతతత్వ శక్తులనైనా ఈ కూటమికి టీవీకే దూరంగా ఉంచితేనే తమ మద్దతు వర్తిస్తుందని షరతు పెట్టింది.