స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన స్నేహితుడు విజ్ఞాన్ ప్రకాశ్ అనే వ్యక్తి పలాశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలాశ్ సినిమా నిర్మాణం పేరుతో రూ.25 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వలేదని డబ్బుల విషయంలో ప్రశ్నించగా పలాశ్ తనను కులం పేరుతో దూషించాడని విజ్ఞాన్ మానే ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సాంగ్లీ పోలీసులు పలాశ్ ముచ్చల్‌పై ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టంలోని సెక్షన్ 3(1)తో పాటు ఐపీసీ సెక్షన్లు 351(2), 352 కింద కేసులు నమోదు చేశారు.