పంజాబ్ లో భారీ పేలుడు సంభవించాయి. గంటల వ్యవధిలో రెండు ప్రదేశాల్లో పేలుడు సంభవించడం తీవ్ర ఆందోళన కరంగా మారింది. జలంధర్ సమీపంలో బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ కార్యాలయం సమీపంలో పార్క్ చేసిన స్కూటర్ పేలిపోయింది. దీంతో భారీ మంటల చెలరేగాయి. అటారీ రోడ్డులో ఉన్న ఆర్మీ ఖాసా కంటోన్మెంట్ పరిధిలో మరో పేలుడు చోటు చేసుకుంది. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. రెండు పేలుళ్లలో ఎటువంటి ప్రాణ నష్టంజరగలేదు.