అమెరికాలోని టెక్సాస్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. కారోల్టన్లో కెటౌన్ ప్లాజాలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బిజినెస్‌లో భాగస్వాములు చర్చలు జరుపుతుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపినట్టు సమాచారం