తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. బీజేపీ నేతలు కేవలం మతపరమైన నినాదాలకే పరిమితమవుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. బీజేపీనాయకులను ఉద్దేశించి చేసిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “మీటింగ్ పెట్టి జై శ్రీరామ్ అనడం తప్ప.. రాష్ట్రానికి తెచ్చిన నిధులు ఏవి?” అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. శ్రీరాముడి నామధేయాన్ని కించపరిచేలా ఆమె మాట్లాడారని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.