హోర్ముజ్ జలసంధిలో ఇరాన్‌కు చెందిన ఏడు ఫాస్ట్ బోట్లను పేల్చివేసినట్లు అమెరికా దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి మూసివేయడంతో.. అక్కడ చిక్కుకున్న నౌకలను తరలించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది. యూఏఈ, దక్షిణ కొరియా దేశాలకు చెందిన నౌకలపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ దాడి వల్ల ఫుజైరా ఆయిల్ పోర్టు వద్ద భారీగా మంటలు వ్యాపించినట్లు యూఏఈ పేర్కొన్నది.ప్రాజెక్టు ఫ్రీడమ్ కింద కొన్ని నౌకలను హోర్ముజ్ నుంచి అమెరికా సురక్షితంగా తరలిస్తున్నది.

