ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ కోసం పనిచేసిన ఇద్దరు వ్యక్తులను ఇరాన్ శనివారం ఉరితీసింది. యాకూబ్ కరీంపూర్, నాసర్ బెకర్జాదేఅనే ఈ ఇద్దరికీ సుప్రీంకోర్టు మరణశిక్ష ఖరారు చేయడంతో.. న్యాయ ప్రక్రియల అనంతరం శిక్షను అమలు చేసినట్టు ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్‌తో 40 రోజులపాటు జరిగిన యుద్ధ సమయంలో కరీంపూర్ మొసాద్‌కు చురుకుగా సహకరించినట్టు అధికారులు తెలిపారు.

