రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతతో చెలగాట మాడుతుందని, నోటిఫికేష్ల విషయంలో నిరుద్యోగులపై అభాండాలు మోపుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు ఆరోపించారు. నిరుద్యోగ యువత తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీని బొందపెట్టుడు ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, యువత ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ధర్నాలు చేస్తుంటే యువతే నోటిఫికేషన్లు వద్దంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నర ఏండ్లుగా యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిందే లేదని విమర్శించారు.

