త్యాగాల పునాదుల మీద పార్టీ బిఆర్ఎస్ ఏర్పడిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. దశాబ్దాలుగా, అన్యాయానికి గురై నెత్తురు మండిన జాతి ఎత్తిన జెండా గులాబీ జెండా అని కొనియాడారు. తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జెండా కెటిఆర్ ఆవిష్కరించారు. సీనియర్ నేతలు పాల్గొన్నారు. జై కెసిఆర్, జై బిఆర్ఎస్ నినాదాలతో తెలంగాణ భవన్ మార్మోగుతుంది.

