ఆంధ్రప్రదేశ్లో ఇంధన సెగలు పుడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరత సామాన్యుల నుంచి రైతుల వరకు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికార యంత్రాంగం “కొరత లేదు” అని ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పరిస్థితి దారుణంగా మారింది. ఇంధనం కోసం కిలోమీటర్ల మేర బారులు తీరుతున్న వాహనాలు, ‘నో స్టాక్’ బోర్డులతో దర్శనమిస్తున్న బంకులు ఏపీలో నెలకొన్న ఇంధన సంక్షోభానికి అద్దం పడుతున్నాయి.

