ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని మహారాజ్‌పూర్ ప్రాంతంలో గురుకులానికి వెళ్తున్న 11 ఏళ్ల దివ్యాంశ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. బాలుడి శరీరంపై 42 తీవ్రమైన గాయాలు ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. అతని వీపు, చేతులు, కాళ్లు, ఛాతీపై లోతైన కమిలిన గాయాలు ఉన్నాయి. అంతేకాకుండా, అతని శరీరంపై 11 సిగరెట్‌తో కాల్చిన గుర్తులు కూడా కనిపించాయి. దివ్యాంశ్ మేనమామ అయిన సౌరభ్ మిశ్రా అలియాస్ కన్హయ్య ఆ పాఠశాలను నడుపుతున్నాడు.

