తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతల మధ్య మరో కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. భూపాలపల్లి డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న రవీందర్ అనే కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇప్పటికే ఒక డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతుండగా, తాజాగా జరిగిన ఈ ఘటన కార్మిక వర్గాల్లో మరింత కలకలం రేపింది. వరంగల్లోని ఎంజీఎం వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. రవీందర్ ఆరోగ్య పరిస్థితిపై అటు కుటుంబ సభ్యులు, ఇటు తోటి కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

