హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి తొలిసారిగా టోల్ వసూలు చేసినట్లు ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ హమీద్‌రెజా వెల్లడించారు. టోల్‌తో వసూలు చేసిన మొత్తం తమ సెంట్రల్ బ్యాంక్ అకౌంట్‌లో జమ అయినట్లు వెల్లడించారు. అయితే ఏ దేశపు నౌక నుంచి దీన్ని వసూలు చేశారనే దానిపై స్పష్టత లేదు. గతంలోనే ఇరాన్ టోల్ ప్రతిపాదనను తీసుకువచ్చింది. ఈ డబ్బును తమ దేశ పునర్నిర్మాణం కోసం వినియోగిస్తామని కూడా పేర్కొంది.

