ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి వయసురీత్యా అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం పంజాగుట్ట శ్మశానవాటికలో భాస్కర్ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.